బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్‌

హైదరాబాద్‌: నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కర్మాన్‌ఘాట్‌ దుర్గానగర్‌ సత్యసాయి అపార్ట్‌మెంట్‌లో దారుణం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గుంతలో వాచ్‌మెన్‌ కుమారుడు వెంకట తస్సావంత్‌(10) మృతిచెందాడు. రక్షణ లేని లిఫ్ట్‌ గుంతలోకి తొంగి చూస్తుండగా తస్సావంత్‌ అదుపుతప్పి కిందికి పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Copyright © 2017 News

X

Share:

Facebook Twitter Google+ Digg